తెలంగాణ ఇస్తే పోయేదేమీ లేదు, తేలేది కాదు: టిజి వెంకటేష్

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు ప్రజలంతా ఆంధ్రప్రదేశ్‌గా అవతరించడానికి రాయలసీమ ప్రజలు తెలంగాణ ప్రాంతానికి రాజధాని ఇచ్చి త్యాగం చేశారని తెలిపారు. దాన్ని కాపాడుకోవడానికి కడవరకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తిరుపతిలో తెలుగు మహాసభలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీలో అఖిలపక్షం నిర్వహించకపోయినా నష్టం ఏమీ లేదన్నారు. అఖిల పక్ష భేటీ తర్వాత తెలంగాణ ఇస్తామంటే సమైక్య ఉద్యమం భగ్గుమంటుందన్నారు.
సమైక్యాంధ్రవాదానికి కట్టుబడి ఉన్నట్లు భేటీ తర్వాత కేంద్రం ప్రకటిస్తే తెలంగాణలో అగ్నిగోళం పుట్టుకొస్తుందని, కాబట్టి అఖిలపక్ష సమావేశంలో తేలేది ఏమీ లేదని కొట్టివేశారు. ఎన్నికల దాకా తెలంగాణ విషయం తేలేది లేదని స్పష్టం చేశారు.
తెలుగువాళ్ళంతా కలిసి ఉండాలంటూ ఆనాడు పెద్దలు చేసిన త్యాగాలకు, వారి ఆకాంక్షకు గొడ్డలిపెట్టు అవుతుందన్న ఆందోళనతోనే సమైక్యాంధ్ర కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆరోజు ఆంధ్ర ప్రజలంతా త్యాగం చేసి రాయలసీమకు రాజధానిని ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇటువంటి త్యాగాల వల్ల తెలుగువాళ్ళంతా ఐకమత్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, దానికోసం చివరిదాకా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తిరుపతిలో తెలుగుమహాసభలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీలో అఖిలపక్షం నిర్వహించకపోయినా నష్టం ఏమి లేదన్నారు.












Click it and Unblock the Notifications