గుజరాత్ పోల్స్: మోడీతో సభకు ఇర్ఫాన్ ఫఠాన్
వడొదర: క్రికెటర్ ఇర్ఫాన్ ఫఠాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖేడాలోని బిజెపి ప్రచార ర్యాలీలో మోడీతో పాటు ఆయన వేదికను పంచుకున్నారు. రాష్ట్రంలో రెండో దశ పొలింగ్ జరిగే ప్రాంతంలో ఇర్పాన్ ఫఠాన్ స్వస్థలం ఉంటుంది. గాయం కారణంగా 28 ఏళ్ల క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ క్రికెట్ క్రీడకు దూరంగా ఉన్నారు. ఆయన వడొదరాకు చెందినవారు.
మోడీ ప్రసంగాన్ని వినడానికి వచ్చిన ఆయన ప్రజల వైపు చేయి ఊపుతూ అభివాదం చేశారు. తన సమావేశానికి వచ్చినందుకు మోడీ ఇర్ఫాన్ పఠాన్‌కు కృతజ్ఢతలు చెప్పారు. అయితే, ఇర్ఫాన్ పఠాన్ ప్రసంగం చేయలేదు, ప్రకటన కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లను బుజ్జగించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు.
మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి మోడీ నిరుడు సెప్టెంబర్‌లో శాంతిసామరస్యాల కోసం సద్బావనా మిషన్‌ను ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది బిజెపి ముస్లిం అభ్యర్థులను ఎవరినీ ఎన్నికల బరిలోకి దింపలేదు.

మోడీ కార్యక్రమానికి ఇర్ఫాన్ పఠాన్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రంజీ ట్రోఫీ మ్యాచులో ఇర్ఫాన్ పఠాన్ గత నెలలో గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. అయితే, యువ బరోడా ఆటగాళ్లతో మాట్లాడడానికి మోతిబాగ్ క్రికెట్ మైదానానికి వెళ్తుంటాడు. నిరుడు సద్భావనా సమావేశంలో కూడా మోడీకి ఇర్ఫాన్ పఠాన్ మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications