ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: భేటీలో బైఠాయింపు, బాబు కొత్త ఎత్తుగడ

|
Google Oneindia TeluguNews

Chandrababu Naiodu
ఆదిలాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తున్నారు. బుధవారం వస్తున్నా... మీకోసం పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిల పక్ష సమావేశం నుంచి బయటకు వద్దామని ఆయన అన్నారు. కాంగ్రెసుకు దమ్ము, ధైర్యం ఉంటే అఖిల పక్ష సమావేశంలో ముందుగా తెలంగాణపై అభిప్రాయం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. తాము కూడా అక్కడే అభిప్రాయం చెప్తామని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా తమపై రుద్దే ప్రయత్నం చేస్తోందని, సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని, కాంగ్రెసును నిలదీయకుండా తమను అడగడమేమిటని ఆయన తెలంగాణవాదులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణపై జాప్యం చేస్తూ కాంగ్రెసు పార్టీ తమను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వల్ల ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు, ఆయన అల్లుడు, కుమారుడు, కూతుళ్లకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ అంటే తిరకాసు పార్టీ అనీ, కెసిఆర్ ఆరు నెలలు ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకుని, తర్వాత ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుంటే రైతుల రుణాలను ఐదు సార్లు మాఫీ చేయవచ్చునని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలువ లేని పార్టీ అని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన జగన్ ఉప రాష్ట్రపతిగా ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపితే ఓటు వేయలేదనీ, ఆ పార్టీకి ముస్లింలపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

English summary
It seems that Telugudesam party president N Chandrababu Naiodu has blamed Cobgress party on Telangana issue. He said that Congress should clarify its stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X