చిరుకు 'సమైక్య' వంత: కాంగ్రెసులోకి జయప్రద?

పుస్తకావిష్కరణ సభలో కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, చిరంజీవిలతో పాటు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు జి. వివేక్, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో జయప్రద తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అనిపించారు. తాను సంయుక్తాంధ్రలో ఉన్నానో, సంయుక్త తెలంగాణలో ఉన్నానో, తెలంగాణలో ఉన్నానో తెలియడం లేదని, అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలు తనను ఆదరించారని ఆమె అన్నారు.
ఆ సందర్భంగా జైబోలో తెలంగాణ సినీ దర్శకుడు శంకర్ పేరును ప్రస్తావిస్తూ ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. జై బోలో తెలంగాణ దర్శకుడు శంకర్ ఇక్కడున్నారంటూ జయప్రద మాట్లాడారు. తాను సినిమాల్లో 9 భాషల్లో నటించానని, తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించారని ఆమె చెప్పుకున్నారు. సత్యజిత్ రేను కూడా తాను కలిశానని, సత్యజిత్ రే సినిమాలో ఎందుకు చేయలేదా అని బాధపడుతుంటానని ఆమె అన్నారు.
సినిమాల్లో నటించడం తనకు తొలుత ఇష్టంగా ఉండేది కాదని, సినిమా చిత్రీకరణ తీరు చూసిన తర్వాత నటించాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి నాయకులు, ప్రముఖ నటులు వచ్చారని ఆమె అన్నారు. చింరజీవిని చూస్తూనే ఉన్నారు, ఆయన తన అనుభూతులు చెబుతారని జయప్రద అన్నారు. సావిత్రి తదితర పాత తరం నటీనటులను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications