వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్‌లో క్రైస్తవం: రెండు,మూడు స్థానాల్లో ఇస్లాం, హిందు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్‌లు ఎక్కువగా ఉన్నారు. ఇస్లాం రెండో స్థానంలో, హిందువులు మూడో స్థానంలో ఉన్నారు. మంగళవారం ప్యూ ఫోరం ఆన్ అనే సంస్థ ప్రపంచంలో ఏ మతం జనాభా ఎంత ఉందో విడుదల చేసింది. 2.2 బిలియన్ల (220కోట్లు)తో క్రిస్టియన్ జనాభా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో క్రిస్టియన్‌ల శాతం 32గా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముస్లిం వర్గం ఉంది.

ముస్లింలు 1.6 బిలియన్(160కోట్లు)తో రెండో స్థానంలో ఉన్నారు. వంద కోట్లకు పైగా హిందువులు ఉన్నారు. ప్రపంచంలో హిందువుల శాతం 15గా ఉంది. ఆ తర్వాత స్థానంలో బుద్దిస్టులు 500 మిలియన్లు, జ్యూస్ 14 మిలియన్స్ ఉన్నారు. బుద్దిస్టులది ఏడు శాతంగా, జ్యూస్‌లది 0.2 శాతంగా ఉంది.

 'Hinduism third largest religion of world'

ప్రపంచంలోని ఎనిమిది ప్రధాన మతాలపై ప్యూ ఫోరం తన డేటాను విడుదల చేసింది. 230 కంటే ఎక్కువ దేశాల నుండి ఈ సమాచారాన్ని సేకరించింది. ప్రతి పది మందిలో ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక మతంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది ప్రజలు మత సమూహంలో ఉన్నారు. ఆఫ్రికన్ ట్రెడిషన్స్‌లో ఉన్న వారిని కలుపుకొని దాదాపు 400 మిలియన్ల ప్రజలు ఫోక్ ట్రెడిషన్‌ను కలిగి ఉన్నారు.

English summary
Hinduism is the third largest religion of the world after Christianity and Islam and 97 per cent of all Hindus live in three Hindu-majority countries - India, Nepal and Mauritius, according to a study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X