ఎంపీ పైకి దూసుకెళ్లిన సోనియా: కొట్టారని ములాయం

బుధవారం మధ్యాహ్నం అప్పటికే రెండు సార్లు వాయిదాపడిన లోక్‌సభ తిరిగి జరుగుతున్న సమయంలో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా కల్పించే బిల్లును ప్రవేశపెట్టేందుకునారాయణ స్వామి సిద్దమయ్యారు. అంతలో ఎస్పీ సభ్యుడు కేంద్రమంత్రి చేతిలోని బిల్లు ప్రతిని లాక్కున్నాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. సోనియా గాంధీ వెంటనే లేచి.. యశ్‌వీర్ సింగ్ వైపు దూసుకెళ్లారు.
ఆయన చేతిలోంచి బిల్లును తిరిగి లాక్కోడానికి ప్రయత్నించారు. సభలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ సభ్యుడిని ఎందుకడ్డుకున్నారని సోనియాను ఎస్పీ సభ్యులను నిలదీశారు. ఈ లోపు కనుమూరి బాపిరాజు, విలాస్ ముత్తెంవార్ తదితర కాంగ్రెస్ సభ్యులు సోనియా చుట్టూ గోడలా నిల్చున్నారు. సమాజ్‌వాది, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరుస సంఘటనలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్పీకర్ మీరాకుమార్.. సభను గురువారానికి వాయిదా వేశారు.
మా ఎంపీని కొట్టారు: ములాయం
పదోన్నతుల్లో కోటాకు తాము వ్యతిరేకమని, దీనిపై పోరాటం కొనసాగిస్తామని ఎస్పీ సుప్రీమో ములాయం సింగ్ స్పష్టం చేశారు. సభలో బిల్లును లాక్కున్న తమ సభ్యుడు యశ్‌వీర్‌ను కాంగ్రెస్ సభ్యులు కొట్టారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును కాంగ్రెస్ బలవంతంగా రుద్దుతోందన్నారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు యశ్‌వీర్ నిరాకరించారు. బిజెపి, శిరోమణి అకాలీదళ్ సభ్యులు కూడా అధికార పార్టీ సభ్యులు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications