జైల్లో జగన్ క్రిస్మస్ వేడుకలు: అనిల్ చర్చిలో విజయమ్మ

కానీ ఈ సంవత్సరం అరెస్టై జైలులో ఉండటంతో క్రిస్మస్‌ను జగన్ తోటి విఐపి ఖైదీల మధ్య జరుపుకున్నారని సమాచారం. పండుగ సందర్భంగా జగన్ తన బ్యారక్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారట. జగన్‌కు తోటి విఐపి ఖైదీలు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, నూకారపు సూర్యప్రకాశ రావు తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు దినం కాబట్టి ములాఖత్‌లు లేకపోవడంతో జగన్‌ను కుటుంబసభ్యులు కలవలేకపోయారు. మరోవైపు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మణికొండ హుడా కాలనీలోని బ్రదర్ అనిల్ కుమార్‌కు చెందిన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చర్చికి వచ్చిన విజయమ్మ, బైబిల్ చేతిలో పట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్, చర్చికి వచ్చిన వారికి క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. జగన్ సోదరి షర్మిలకి కీ హోల్ ఆపరేషన్ అయి విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications