బెల్ కొట్టగానే ఆగేందుకు బడి పిల్లలమా?: జయలలిత

Jayalalitha
న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి(ఎన్‌డిసి) సమావేశంలో తనకు మాట్లాడేందుకు కేవలం పది నిమిషాలే కేటాయించారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం కేంద్రంపై మండిపడ్డారు. గంట కొట్టగానే ఆపేందుకు ముఖ్యమంత్రులు ఏమీ బడి ఈడు పిల్లలు కాదని ఆమె ధ్వజమెత్తారు. ఎన్‌డిసి సమావేశానికి పిలిచి ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వక పోవడం తమను అవమానించడమే అన్నారు.

తనకు సమయం కేటాయించలేదని ఆరోపిస్తూ జయలలిత జాతీయ అబివృద్ధి మండలి సమావేశం నుండి జయలలిత వాకౌట్ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఇంత మాత్రానికే తమను చెన్నై నుండి న్యూఢిల్లీకి పిలవాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. పది నిమిషాలు పూర్తి కాగానే బెల్ కొట్టి తనను అవమానించారన్నారు.

ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. ఆరు కోట్ల తమిళ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి ఇలా పది నిమిషాలు మాట్లాడాలని నిబంధన పెట్టలేదని ఆమె ధ్వజమెత్తారు. తాను పలు జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొన్నానని, కనీసం అరగంట పాటు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. కేంద్రం చర్య సరైనది కాదన్నారు.

కాగా జయలలిత ఆరోపణలు కేంద్రం ఖండించింది. ప్రధాని ప్రసంగం పూర్తి కాగానే జయలలితను ప్రసంగించమని కోరారని, అసలైతే ఆమె వంతు తర్వాతెప్పుడో వచ్చేదని కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. అందరు కలిసి దాదాపు 35 మంది మాట్లాడాల్సి ఉందని, అందుకే ఒక్కొక్కరికి పది నిమిషాలు కేటాయించామన్నారు. పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా అవకాశం ఉంటుందని, అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+