నూరు శాతం విభజన జరగదు: లగడపాటి, బాబుపై ఫైర్

Lagadapati Rajagopal
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన నట్టేట ముంచారన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయనను క్షమించే అవకాశం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు. రాష్ట్రాన్ని ఎవ్వరూ విడదీయలేరని, ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు.

విభజన జరగదని, ఇది నూరు శాతం సుస్పష్టమైందని లగడపాటి అన్నారు. తన అంచనా ఎప్పుడూ తప్పు కాలేదన్నారు. విభజనకు సానుకూల పరిస్థితి లేదని అఖిలపక్షంతో తేలిపోయిందన్నారు. చంద్రబాబు లేఖతో కేంద్రం అయోమయంలో పడిందన్నారు. రాష్ట్ర విభజనకు సిద్ధంగా లేమని సుస్పష్టంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన లేఖతో చంద్రబాబు కేంద్రాన్ని సందిగ్ధంలోకి నెట్టారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని విభజించేది లేదని కేంద్రం స్పష్టం చేసే అవకాశానికి చంద్రబాబు లేఖ గండి కొట్టిందని విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరని మంత్రి తోట నరసింహం కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ పైన సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+