రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగురించి తెలియదు: బాబుపై కిరణ్, నగదుబదలీ స్టార్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
రాజమండ్రి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి జైరామ్ రమేష్‌లు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో నగదు బదలీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా నగదు బదలీ పథకం ప్రారంభమైంది. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నగదు బదలీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్, జైరామ్ రమేష్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిరణ్ బహిరంగ సభలో మాట్లాడారు.

తమ ప్రభుత్వం పథకాలను నీరుగార్చుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కానీ, వచ్చే ఉగాది నుండి మరో ఐదారు నిత్యావసర వస్తువులను రేషన్ ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని కిరణ్ అన్నారు. పథకాలు తగ్గిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారని కానీ, ఒక్క రూపాయి బియ్యంతో పాటు మరిన్ని పెంచుతున్నామని ఆయన అన్నారు.

ఒక్కరూపాయికి బియ్యం ఇస్తున్నారు. కానీ ఇతర నిత్యవసర ధరల పెరుగుదల మాటేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెసు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశీస్సులతో కాంగ్రెసు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతోందన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి బాకీలు ఉన్నాయని చెప్పారు.

కాగా ఐ.పోలవరంకు చెందిన సత్యనారాయణమూర్తి అనే వికలాంగుడు నగదు బదలి తొలి లబ్ధిదారుడుగా రికార్డుకెక్కాడు. అవినీతి, దళారీ, నకిలీలను అరికట్టేందుకే అధార్ కార్డులు అని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ అన్నారు.

English summary

 CM Kiran Kumar Reddy said on Sunday in East Godavari district that TDP chief Nara Chandrababu Naidu is don't know about him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X