వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు 'పవర్'తో గెలిచాం, ఆ పార్టీలతో పొత్తుండదు:దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచడంతో వాటికి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ బుధవారం అన్నారు.

నిర్మాణ రంగంలో కార్మికుల సెస్ విషయంపై అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు మంత్రులు అవగాహన లేకుండానే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని ప్రకటనలు ఇస్తున్నారని సహచర మంత్రులు సి.రామచంద్రయ్య, డిఎల్ రవీంద్రా రెడ్డిలపై దానం పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం జరగాలంటే కేబినెట్‌లో చర్చించిన తర్వాతే అమలవుతుందని తెలిపారు. ఈఆర్‌సి సిఫార్సులు లీక్ చేయడాన్ని తాను తప్పు పడుతున్నానని, లీక్ చేసిన సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు.

మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు వ్యక్తిగతం కాదని, సభ్య సమాజం తలదించుకునేలా ప్రసంగించిన ఆయనపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ, ఎంఐఎంలతో పొత్తు ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బిజెపి, ఎంఐఎం మతతత్వ పార్టీలన్నారు. నిర్మాణ రంగంలో సెస్ వసూలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

English summary
Minister Danam Nagender has blamed ministers who are giving statement on power hikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X