హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్ వెనుక పాక్, తర్వాతే జవాన్ల నరికివేత: స్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripoornananda Swami
హైదరాబాద్/వరంగల్: మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవసీ వ్యాఖ్యల వెనుక పాకిస్తాన్ హస్తం ఉండి ఉంటుందని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన శనివారం వరంగల్ జిల్లాలోని ఏకశిల పార్కులో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అక్బర్ మాట్లాడిన రోజులకే పాకిస్థానీయులు భారత జవాన్ల తలలు నరికి భారతీయులకు హెచ్చరిక జారీ చేశారన్నారు.

దేశ భద్రతను సవాల్ చేసే ధైర్యం అక్బరుకు వచ్చిందంటే అనుమానించాల్సి వస్తుందన్నారు. దేశ చరిత్ర అంటే హిందూ ధర్మమేనని పరిపూర్ణానంద అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి నిలబడి కోట్లాది రూపాయలు సంపాదించగలుగుతున్నాడని, వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారని, నాయకులు తాము సంపాదించిన కోట్లాది రూపాయలను స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారన్నారు.

ఇటీవల కొనసాగుతున్న సంతకాల సేకరణ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, దీంతో ప్రజలకు ఉపయోగం లేదని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడితే బాగుండేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు మనమంతా ఐక్యత ప్రదర్శిస్తామన్న ప్రతినతో రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మందిచే సంతకాల ఉద్యమాన్ని తమ శ్రీపీఠం వరంగల్లు నుంచి వివేకానందుని జయంతివేళ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

బిజెపిని గెలిపిస్తారా?

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని మజ్లిస్ నేతలు చెబుతుండటం వెనుక ఆ పార్టీ ఉద్దేశం ఏంటని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించడం అంటే పరోక్షంగా బిజెపిని గెలిపించేందుకు కృషి చేయడమే, కాంగ్రెస్‌ను బలహీనపరచడం అంటే, బిజెపిని బలపర్చడమే అన్నారు. ఎవరూ మత విద్వేషాలకు రెచ్చగొట్టకూడదని కోరారు. నగరానికి పరిమితమైన మజ్లిస్ పార్టీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం అసాధ్యమన్నారు.

English summary
Sri Peetham's Paripoornananda Swamy has suspected
 
 Pakistan behind MIM Akbaruddin Owaisi's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X