28లోగా తెలంగాణ: బలరాం, ఒత్తిడికి ధర్నా: నారాయణ

అలా అయితే కాలం చెల్లినట్లే
నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామన్న కాంగ్రెసు పార్టీ వాగ్ధానం మరో ఎత్తుగడే అయితే ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఈ నెల 19వ తేదిన ఇందిరాపార్కు వద్ద సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ధర్నాకు సంబంధించిన పోస్టరును నారాయణ విడుదల చేశారు. ఒత్తిడి పెంచేందుకే ధర్నా అన్నారు.
ధర్నాకు తెలంగాణకు అనుకూలంగా ఉన్న అన్ని పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసులను మాత్రం ఆహ్వానించడం లేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయమే అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని కూడా ఈఆర్‌సి చైర్మన్‌కే ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈ నంల 22న పది వామపక్ష పార్టీలతో కలిసి అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు.
రాష్ట్రం ఇస్తారని నమ్మకం లేదు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ వేరుగా అన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఈ నెల 28న రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఇదే అంశంపై ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో ఈ నెల 15 నుంచి టఫ్ నేతృత్వంలో ఆందోళన చేస్తామన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications