వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూతీవ్రవాదం ప్రోత్సహిస్తున్నబిజెపి, ఆరెస్సెస్:షిండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sushilkumar Shinde
జైపూర్: కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి)లు హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. జైపూర్‌లోని కాంగ్రెసు పార్టీ చింతన్ శిబిర్‌లో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బిజెపిలు క్యాంపుల పేరుతో హిందూ ఉగ్రవాదాన్ని దేశంలో ప్రోత్సహిస్తున్నట్లుగా తమకు నివేదికలు చెబుతున్నాయన్నారు.

సంఝౌతా ఎక్సుప్రెస్, మక్కా మసీదు, మాలేగామ్ పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆయన ఆరోపించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లు హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను ఏదో కొత్త విషయం చెప్పలేదని, ఉన్న విషయాన్నే చెప్పానని అన్నారు. సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను దిగ్విజయ్ సింఘ్ సమర్థించారు. ఆ రెండు హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్న షిండే వ్యాఖ్యలు సబబే అన్నారు.

షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు

షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. షిండే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెసు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలన్నారు.

షిండే వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. బిజెపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను హెచ్చరించడం మానేసి బిజెపిని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.

గడ్కరీకి ఆర్ఎస్ఎస్ మద్దతు

త్వరలో జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ రోజు బిజెపి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 23న గడ్కరీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

English summary
Union home minister Sushilkumar Shinde on Sunday sparked a major political controversy saying RSS and BJP were promoting Hindu terror.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X