పాతబస్తీ నిర్మానుష్యం: అక్బర్ రిమాండ్ పొడగింపు

ఆర్టీసీ బస్సులే కాదు, ఆటో రిక్షాలు కూడా పాతబస్తీలో కనిపించడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సోమవారం కూడా పాతబస్తీలో బంద్ వాతావరణమే నెలకొని ఉంది. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, ఇతర పట్టణాల్లోనూ, తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోనూ రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది.
హైదరాబాదులో సోమవారం చెదురుమొదరు సంఘటనలను చోటు చేసుకున్నాయి. సోమవారం రాత్రి హైదరాబాదు పాతబస్తీలోని బహదూర్‌పురాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసి బస్సుపై దాడి చేశారు. బస్సుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ గాయపడ్డాడు. హైదరాబాదులోని పాతబస్తీలో, సంగారెడ్డి, తదితర ప్రాంతాల్లో పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. తాము సోమవారం బంద్‌కు పిలుపునివ్వలేదని, ప్రజలే స్వచ్ఛదంగా బంద్ పాటించారని మజ్లీస్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ చెప్పారు. మెదక్ జిల్లా మాజీ కలెక్టర్‌పై దాడి చేశారనే ఆరోపణపై అసదుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, అక్బరుద్దీన్‌ను ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసులు సోమవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్బరుద్దీన్ జ్యుడిషియల్ కస్టడీని వచ్చేనెల 5వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!