వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై ఆంధ్రప్రదేశ్‌తో సంబంధంలేదు, మిత్రుడనివచ్చా: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

otsa Satyanarayana
రాజమండ్రి: కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ సభకు, కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయమే శిరోధార్యం అన్నారు. ఉండవల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభ కాంగ్రెసు సభ కాదన్నారు.

ఇక్కడ జరిగిన విషయాన్ని పార్టీ అధిష్టానానికి తాను వివరిస్తానని చెప్పారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయమే అంతిమం అన్నారు. తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఉండవల్లి మిత్రుడిగా పిలిచినందువల్లే తాను ఈ సభకు వచ్చానని చెప్పారు. ఇది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తలపెట్టిన జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా తమ సమైక్యవాదాన్ని తమ పార్టీ అధిష్టానానికి బలంగా వినిపిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు.

నేడు సాయంత్రం సభ

ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రిలోని సుబ్రహ్మణ్య మైదానంలో స్థానిక పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జై ఆంధ్రప్రదేశ్ సభ జరగనుంది. ఈ సభలో ఉండవల్లి ముప్పై ఏళ్ల క్రితం తాము జై ఆంధ్ర ఎందుకు అన్నామో? ఇప్పుడు ఎందుకు జై ఆంధ్రప్రదేశ్ అంటున్నామో? వివరించనున్నారు.

ఈ సభకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, పదిమంది మంత్రులు, ఆరుగు పార్లమెంటు సభ్యులు రానున్నారని తెలుస్తోంది. సమైక్యాంధ్ర కోరుకునే మేధావులు, పలు పార్టీలకు చెందిన నేతలు కూడా రానున్నారు. అందరూ సమైక్యాంధ్ర ఆవశ్యకత పైన మాట్లాడనున్నారు.

English summary

 Pradesh Congress Committee president Botsa Satyanarayana said on Friday that there is no relation to Rajahundry MP Undavalli Arun Kumar's Jai Andhra Pradesh meeting to Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X