సహకార :'9మంది జగన్ ఎమ్మెల్యేల బహిష్కరణ' వీరే..

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన తొమ్మిది మంది శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ వేటు వేసింది. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రకటించారు. జగన్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను తాము పార్టీ నుండి బహిష్కరించామని ఆయన చెప్పారు.

డబ్బుల కోసం ఇతర నేతలకు అమ్ముడుపోయిన, వ్యక్తిత్వం లేని వారిని తాము పట్టించుకోమన్నారు. నేతల తీరుపై తాము తెలుగుదేశం పార్టీలో పూటకోమాట మాట్లాడమని చెప్పారు. జగన్ వైపు వెళ్తున్న తొమ్మిది మందిని తాము బహిష్కరించామన్నారు. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సహకార ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చినందు వల్లే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందంటున్నారు.

కాగా జగన్ వైపు ఇటీవల పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు వెళ్లిన విషయం తెలిసిందే. వారి పైనే వేటు వేసినట్లు బొత్స చెప్పారు. బొత్స వేటు వేసినట్లు చెప్పిన వారిలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, పేర్ని నాని, మద్దాల రాజేష్ ఉన్నారు. మరో ముగ్గురిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

2009లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ తొమ్మిది మందిలో ఇప్పటికే కొందరు జగన్ పార్టీలో చేరగా మరికొందరు చేరుతామని ప్రకటించారు. ఇంకొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+