టాలెంట్‌కి అడ్డు:గర్ల్స్‌ర్యాక్ బ్యాండుకు నో, ఆపొద్దని సిఎం

రాక్ బ్యాండ్ బృందం ప్రదర్సనలు ఇవ్వవద్దని ఆన్‌లైన్‌లో బెదిరింపులు కూడా వచ్చాయట. ఫత్వా జారీ చేయడం, ఆన్ లైన్‌లో బెదిరింపుల నేపథ్యంలో ముగ్గురు అమ్మాయిలతో కూడిన ప్రగాష్ రాక్ బ్యాండ్ బృందం తమ ప్రదర్శనలను నిలిపివేసింది. అయితే వీటిపై వారు పెదవి విప్పడం లేదు. ఫత్వా నేపథ్యంలో సంగీత ప్రదర్శనలు ఇవ్వకూడదని వారు నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.
పాటలు పాటడం ఇస్లామిక్ ప్రబోధాలకు వ్యతిరేకమని, దీనివల్ల సమాజంలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించలేరని తాను చెప్పానని, పాడటాన్ని ఆపాలని బాలికలకు సూచించినట్లు బషీరుద్దీన్ చెప్పారు. పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు నోమా నజీర్, ఫరా దీబా, అనీకా ఖలీద్‌లు గత డిసెంబరులో జరిగిన వార్షికోత్సవ సంగీత పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. దాంతో వారు వెలుగులోకి వచ్చారు.
ప్రగాష్ పేరిట వారు రాక్ బ్యాండును ఏర్పాటు చేసిన తొలి పోటీలోనే ఉత్తమ ప్రదర్శన అవార్డును గెలుచుకున్నారు. అప్పటి నుండి వారికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయి. అయితే ప్రగాష్ రాక్ బ్యాండుకు ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. బాలికలకు బషీరుద్దీన్ జారీ చేసిన ఆదేశాన్ని తన ట్విట్టర్‌లో తోసిపుచ్చారు. మూర్ఖులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని పాటలు పాడటాన్ని ఆపొద్దని సూచించారు. ప్రతిపక్ష పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ కూడా దీనిని ఖండించారు. ఇలాంటి వల్ల మతానికి చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications