రచ్చబండతో షర్మిలయాత్ర పునఃప్రారంభం, వెంటఫ్యామిలీ

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం పునఃప్రారంభమైంది. హైదరాబాదులో లోటస్‌పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం షర్మిల తుర్కయాంజల్‌కు బయలుదేరారు. ఆమె గత ఏడాది డిసెంబర్ 15న అక్కడే యాత్రను ఆపేశారు.

అదే ప్రాంతం నుండి ఆమె యాత్రను ఈ రోజు ప్రారంభించారు. ఆమె వెంట పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి, మాజీ మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి తదితరులు ఉన్నారు. తుర్కయాంజల్‌లో షర్మిల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో పలు సమస్యలపై చర్చించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు.

కాగా అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాలికి ఆపరేషన్ కాలేదని, అదే నిజమైతే వివరాలు బయటపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఆపరేషన్ పైన కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆయన విమర్సించారు. తమకు అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

2009లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ పేరుతో దొంగ దీక్ష చేశారని ఆరోపించారు. కెసిఆర్ దొంగ దీక్ష బండారం బయట పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కెసిఆర్ వైద్య పరీక్షల వివరాలను కవితకు తాను పంపిస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి వస్తున్న ప్రజా స్పందనను తెలంగాణ రాష్ట్ర సమితి జీర్ణించుకోలేక పోతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+