జగన్ పార్టీవి అవాస్తవాలు, టిడిపికి అండ: కల్యాణ్‌రామ్

Kalyan Ram
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే వస్తున్నా మీకోసం పేరిట పాదయాత్ర చేస్తున్నారని ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు నందమూరి కల్యాణ్ రామ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో అన్నారు. తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడి పైన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవాస్తవాలు చెబుతోందన్నారు.

తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలుగు ప్రజల బాగు కోసమే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశాన్ని స్థాపించారని చెప్పారు. అలాంటి టిడిపికి తమ కుటుంబం అండగానే ఉంటుందన్నారు. తెలుగుదేశం తెలుగు ప్రజల కోసమే పాటుపడుతుందన్నారు.

ఆధార్ కార్డుల కోసం తొక్కిసలాట

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆధార్ కార్డుల కోసం తొక్కిసలాడలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

టిడిపి అధికారంలోకి వస్తే వస్త్రాల పైన వ్యాట్‌ను తొలగిస్తామని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి మహానగరంగా ఏర్పాటు చేస్తామన్నారు. గ్యాస్ ధరలను కాంగ్రెసు ప్రభుత్వం విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. కాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బాబును కలుసుకొని పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+