కన్నడనాట లోకాయుక్తగా కరీంనగర్ జస్టిస్ భాస్కరరావ్

ఈ నియామకంపై కర్ణాటక న్యాయవాదుల సంఘాలు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆయనకు కన్నడ భాష రాదని ఆరోపించాయి. ఈ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాకు చెందిన జస్టిస్ భాస్కర రావు సమర్థుడైన, నిజాయితీపరుడైన న్యాయమూర్తిగా పేరుప్రఖ్యాతులు పొందారు. పదహారు నెలలుగా కర్ణాటక లోకాయుక్త పదవి ఖాళీగా ఉంది.
అంతకుముందు శివరాజ్ పాటిల్ లోకాయుక్తగా ఉన్నారు. అతను సెప్టెంబర్ 2011లో రాజీనామా చేశారు. చాలా రోజుల తర్వాత లోకాయుక్తగా జస్టిస్ భాస్కర రావు నియమితులయ్యారు. ప్రభాకర రావు కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందినవారు. ఆయన 1999 జనవరి 17న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది మార్చి 9న ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టి 2000 జూన్ 26న పదవీ విరమణ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బి పూర్తి చేసిన భాస్కర రావు రాష్ట్ర హైకోర్టు జడ్జిగా పదోన్నతిని పొందారు. తరువాత కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2002 అక్టోబర్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ చైర్మన్‌గా, మెడికల్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. 2003 అక్టోబర్‌లో కేంద్ర మానవ హక్కుల సంఘం సభ్యులుగా నియమితులై 2008 జూన్ వరకు కొనసాగారు.












Click it and Unblock the Notifications