ఎర్రన్నతర్వాత టిడిపిలో విసిగిపోయా:ఎమ్మెల్యే, సస్పెండ్

Sairaj
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోని రాజకీయాలతో తాను విసిగిపోయి బయటకు వస్తున్నానని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే శిరియ సాయిరాజ్ శుక్రవారం అన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ములాకత్ సమయంలో ఈ రోజు ఉదయం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను త్వరలో జగన్ పార్టీలో చేరుతానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నేత ఎర్రన్నాయుడు మృతి తర్వాత తాను పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయాలతో విసిగిపోయానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, వాటిని చూసి తాను జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

తన రాజకీయ గురువు ఎర్రన్నాయుడు అకాల మృతితో తర్వాత తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆయన తర్వాత జిల్లాలో సమస్యలు పరిష్కరించే వారు కరువయ్యారన్నారు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినా లాభం లేకపోయిందన్నారు. మొదట తాను రాజకీయాల నుండి తప్పుకుందామని భావించానని కానీ, వైయస్ పాలన చూసి జగన్ వద్దకు చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తనకు జగన్ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వెంట నడుస్తానని చెప్పారు. తన జిల్లా సమస్యలను జగన్‌కు వివరించాలని, ఏవిధంగా పరిష్కరిస్తారో చర్చించానన్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సాయిరాజ్ సస్పెన్షన్

జగన్‌తో భేటీ అయిన విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఎమ్మెల్యే శిరియ సాయిరాజ్ పైన బహిష్కరణ వేటు వేసింది. సాయిరాజ్‌తో పాటు ఆయనను కల్సిన ఇచ్ఛాపురం ఇంఛార్జ్ వెంకటరణలపై కూడా వేటు వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+