హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టీచర్‌కు ఎస్సై వేధింపులో ట్విస్ట్, ఇరికించాలనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

'SI didnt' stalk woman'
హైదరాబాద్: రాజధానిలోని అడ్డగుట్టకు చెందిన మహిళా టీచర్ లీలకు ఎస్సై వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. తనను ఎస్సై వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన లీల రెండు రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె ఆచూకిని పోలీసులు గురువారం గుర్తించారు. లీల యూసఫ్ గూడలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది.

తన బంధువులకు ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవటంతో వెళ్లినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎస్సై సుధీర్‌ను ఇరికించాలనే ఉద్దేశ్యంతోనే ఆమె చనిపోతానని లేఖ రాసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బంధువుల ఇంటిలో లీలను గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి తమ అదుపులోకి తీసుకున్నారని సమాచారం. లీలతో పాటు ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని శుక్రవారం విచారిస్తున్నారు.

సుధీర్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఆయనను ఇరికించాలని, ప్రభుత్వపరంగా వేటు వేయించాలని వేధింపుల లేఖ నాటకం ఆడారనే వార్తలు వస్తున్నాయి. అయితే, లీలను, ఆమె సోదరుడిని పోలీసులు విచారిస్తున్నందున ఆ తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. లీలను ఎస్సై సుధీర్ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పోలీసులు భావిస్తున్నారట.

కాగా ఎస్సై సుధీర్ తనను వేధిస్తున్నాడని రెండు రోజుల క్రితం లీల లేఖ రాసి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. దీంతో, సుధీర్‌ను సస్పెండ్ చేశారు. ఆయన అప్పటి నుండి కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, లీల బంధువుల ఇంటిలో దొరకడం, సుధీర్ వేధించలేదనడంతో ఇది కొత్త మలుపు తిరిగింది.

English summary
The missing shcool teacher, who was allegedly haassed by s SI, was traced by the police on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X