హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరెస్ట్‌కి సిగ్గుపడం, జగన్‌లా లక్షకోట్లు దోచామా?: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్/మహబూబ్ నగర్: తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలా లక్ష కోట్ల రూపాయలు దోచుకోలేదని, అధికార కాంగ్రెసు పార్టీలు కుంభకోణాలు చేయలేదని తమను ఎందుకు అరెస్టు చేస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం అన్నారు. తాము ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తమను జైల్లో పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉదయం హైదరాబాదులో మీడియాతో ఆ తర్వాత పాలమూరులో బస్సుయాత్రలో హరీష్ మాట్లాడారు.

అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే మొదట తెరాసకు చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఆ తర్వాత కార్యకర్తల జోలికి వెళ్లాలన్నారు. బందులో ఏం జరిగినా మంత్రి డికె అరుణదే బాధ్యత అన్నారు. జిల్లాకు చెందిన మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో తలపెట్టిన సడక్ బందుకు ఆమె అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సడక్ బందును శాంతియుతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.

సడక్ బందుకు ప్రతి పది కిలోమీటర్‌కు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జీగా నియమించామని ఆయన తెలిపారు. సడక్ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని హరీష్‌రావు హెచ్చరించారు. అనుకోనిది జరిగితే తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

సడక్ బంద్ సెగ ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తగిలేలా నిర్వహించాలన్నారు. బైండోవర్ కేసులు పెట్టి అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే కానీ, సిగ్గుపడమన్నారు. సడక్ బందులో తెలంగాణవాదులపై లాఠీఛార్జ్ జరిగితే జిల్లా డికె అరుణ బాధ్యత వహించాలన్నారు. విధ్వంసం, హింస తమ లక్ష్యం కాదన్నారు. అనుమతిస్తే ప్రశంతంగా సడక్ బందు సాగుతుందన్నారు. అనుతివ్వకుండే 24 గంటల పాటు రోడ్ల పైనే బైఠాయిస్తామన్నారు.

English summary
TRS MLA Harish Rao said on Wednesday that they were not looted people like YSR Congress Party cheif YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X