ఆత్మహత్య చేసుకుంటా: వైయస్ వివేకానంద హెచ్చరిక

నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నిక నిర్వహణకు తగిన ప్రత్యమ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించాలనే తమ డిమాండును సర్కారు పట్టించుకోకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణకోసం తాము ఆత్మహత్యకు కూడా సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్ వివేకానంద హెచ్చరించారు.
కాగా అంతకుముందు కడప డిసిసిబి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. డిసిసిబి ఎన్నికల అధికారి అదృశ్యం కావడం, కార్యాలయం వద్దకు భారీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేరుకోవడం, కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి కాన్వాయ్ పైన జగన్ పార్టీ నేతలు చెప్పుల దాడి చేయడం తెలిసిందే. ఆయన దీనిపై వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనపై దాడి అంశంపై వీరారెడ్డి మండిపడ్డారు. డిసిసిబి అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన తన వాహనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చెప్పులు విసిరారని అన్నారు. తమ పార్టీ సభ్యులను తీసుకు వెళ్తున్న సమయంలో జగన్ పార్టీ కార్యకర్తలు దాదాపు 500 మంది వరకు వచ్చి తన వాహనానికి అడ్డుపడి దాడి చేశారన్నారు. చెప్పులు విసిరి బీభత్సం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.












Click it and Unblock the Notifications