బంద్: కార్మికుడి చెవి కోసిన దీదీ పార్టీ కార్యకర్తలు

పనికి హాజరు కాని కార్మికుడి ఎడమ చెవిని తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు గురువారం కోసేశారు. అతడు వెంటనే ఆస్పత్రికి పరుగెత్తాడు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. భారత్ బంద్‌లో పాల్గొనకూడదని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
కార్యాలయాలకు వెళ్లకుండా బంద్‌కు మద్దతు ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు కూడా. సమ్మెలో పాల్గొనేవారికి సెలవులు మంజూరు చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వోద్యోగులను హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చేయి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ సంఘటన జరిగింది. పంచాయతీరాజ్ ఉద్యోగి చెవి కోసిన సంఘటన కూడా ఇదే జిల్లాలో జరిగింది.
భారత్ బంద్ విషయంలో మమతా బెనర్జీ బుధవారం ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. బంద్ జరుగుతున్న తీరుపై ఆ జర్నలిస్టు మమతా బెనర్జీతో వాదనకు దిగాడు. దీంతో ఆమె ఆ జర్నలిస్టుపై తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications