హైదరాబాద్ పేలుళ్లు: ఎవరీ ఉగ్రవాది రియాజ్ భత్కల్?

రియాజ్ నిషేధిత 'సిమి' సంస్థలో కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లి, అక్కడినుంచి పాకిస్థాన్‌కు చేరాడు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరి అగ్రస్థాయికి ఎదిగాడు. భారత్‌లో పలు నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించింది రియాజేనని చెబుతారు. 2010లో పుణెలో జరిగిన జర్మన్ బేకరీ పేలుళ్లు, 2011లో జరిగిన ముంబై పేలుళ్లలో రియాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సమాచారం.
హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో రియాజ్ నేరుగా పాల్గొన్నాడా లేక అతని అనుచరులు ఆపరేషన్‌లో పాల్గొన్నారా అనేది విచారణలో తేలాల్సి ఉంది. అయితే, హైదరాబాదులోని దిల్‌షుక్ నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారిగా రియాజ్‌నే అనుమానిస్తున్నారు.
గతంలో బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సిసిబి) పోలీసులు 2012 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో దర్యాప్తు జరిపి 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. మరో పదిమంది కోసం గాలింపు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిలో 12 మందిపై ఎన్ఐఏ వర్గాలు బుధవారం చార్జిషీటు దాఖలు చేశాయి. దీంతో పాటు కేంద్ర హోం శాఖకు ఒక నోట్ సమర్పించారు.
ఎన్ఐఏకు ఇంకా దొరకని వారిలో కరడుగట్టిన ఉగ్రవాది, కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ పేలుళ్ల వెనుక ప్రణాళిక రియాజ్‌దేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్జిషీట్ దాఖలైన పన్నెండు మంది ఉగ్రవాదులు లష్కరే తాయిబా, హుజి సంస్థలకు చెందినవారు.












Click it and Unblock the Notifications