మారనంటే మారను: పార్టీ మార్పుపై టిడిపి అయ్యన్న

అయ్యన్న పాత్రుడు పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడేది లేదన్నారు. తుది శ్వాస వరకు టిడిపితోనే ఉంటానని చెప్పారు.
విశాఖపట్నం జిల్లాలో నేతల మధ్య వివాదం విషయంలో త్రిసభ్య కమిటీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని వీడుతానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. పార్టీ మార్పు వార్తలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
150 కేజీల కేక్ కట్
చంద్రబాబు పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు శుక్రవారం ఉదయం హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 150 కిలోల కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications