బాబు అమ్ముకున్నారు, జగన్‌వస్తే అంతే మంచి: షర్మిల

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు తమ భూములు, ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదని అదే తన తండ్రి హయాంలో మంచి పాలన అందించారని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే వైయస్ పాలన వస్తుందన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. పీజు రీయింబర్సుమెంట్స్ లేక విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే జగన్ హయాంలో విద్యార్థులకు, రైతులకు మంచి రోజులు వస్తాయన్నారు.
రైతులకు, బిసిలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం చేసే వ్యక్తి జగన్ ఒక్కడేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో అన్నారు. చంద్రబాబుకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరికీ చేసింది లేదన్నారు.












Click it and Unblock the Notifications