ఆదేశాలు బేఖాతరు, కాంగ్రెస్‌కి ఓటు: జగన్‌పార్టీలో చిచ్చు

వారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ పలువురు డైరెక్టర్‌లు ఓటు వేశారు. దాదాపు పదికి పైగా డైరెక్టర్‌లు ఎన్నికల్లో ఓటు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఎనిమిది మంది వరకు అధికార కాంగ్రెసు పార్టీకి మద్దతుగా ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
జిల్లా పార్టీ నేతల ఆదేశాలు ధిక్కరిస్తూ ఎన్నికలకు దూరంగా ఉండకుండా ఎన్నికల్లో పాల్గొనడంతో వారిపై వేటు వేయాలని జిల్లా పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాల్లో అత్యధిక స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కాంగ్రెసు ఉంది. దీంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుందు.
కానీ, పలువురు డైరెక్టర్‌లు ఓటు వేయడంతో వారిని బహిష్కరిస్తామని జిల్లా నేతలు చెప్పారు. సస్పెన్షన్ పైన సొసైటీ అధ్యక్షుడు సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు. తమను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు. తమ పార్టీలో మెజార్టీ సభ్యుల మద్దతు కాంగ్రెస్‌కే అన్నారు. తమ జిల్లా నాయకత్వం టిడిపికి మద్దతివ్వాలని ఒత్తిడి చేసిందని, తాము తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా డిసిఎంస్, డిసిసిబి ఓట్ల లెక్కింపు సాగుతోంది. డిసిఎంఎస్‌లో ఒక డైరెక్టర్ పోస్టును టిడిపి కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications