హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్థాయి సంఘాల పాత్ర, పనులపై శానససభలో ఏర్పాటైన అవగాహనా కార్యక్రమాన్ని పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ సోమవారం ప్రారంభించారు. శానససభ్యులకు, ఎమ్మెల్సీలకు స్థాయి సంఘాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి హాజరయ్యారు.

మంత్రులతో పాటు శానససభ్యులు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సభ సజావుగా సాగితే మీడియా ప్రచారం లభించడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో అన్నారు. ప్రభుత్వానికి దిక్సూచిగా స్థాయి సంఘాలు పనిచేయాలని తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. మీడియా కవరేజీ కోసమే ప్రతిపక్షాలను సభను స్తంభింపజేస్తున్నాయని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు.

సభలో ఎంత చర్చ జరిగితే అంత మంచిదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి స్థాయి సంఘాలు మంచి సలహాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా స్థాయి సంఘాలు పనిచేయాలని శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు. చర్చ జరగకుండా ఏ అంశాన్ని కూడా సభలో ఆమోదించడం సరి కాదని గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు.

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన

స్థాయి సంఘాలపై అవగాహనా కార్యక్రమానికి ముందు గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించిన శివరాజ్ పాటిల్, నరసింహన్, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు.

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన

స్థాయి సంఘాలపై అవగాహనా కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, నరసింహన్, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, చక్రపాణి తదితరులు.

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన

స్థాయి సంఘాలపై అవగాహనా కార్యక్రమంలో శివరాజ్ పాటిల్‌తో నరసింహన్ ముచ్చట..

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన

స్థాయి సంఘాలపై అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి...

చిత్రాలు: స్థాయీ సంఘాలపై అవగాహన

స్థాయి సంఘాలపై అవగాహనా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇలా శ్రద్ధగా...

English summary
The CM Kiran kumar Reddy, Governor ESL Narasimhan, along with Punjab governor Shivraj Patil participated in orientation program on role and functions of standing committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X