మోడీకి వార్టన్ నో: రద్దు చేసుకున్న 'సేన' నేత, వ్యాపారి

కాగా, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఎదురు ఆదివారం ఎదురు దెబ్బ తగిలింది. ఆయన అభివృద్ధి మంత్రానికి మంత్రముగ్ధురాలైన అమెరికా... ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకుంటోందని కథనాలు వస్తున్న సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆయన ప్రసంగాన్నే రద్దు చేసిందో అమెరికా విశ్వవిద్యాలయం.
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరంలో ఈ నెలాఖరులో నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేయాల్సి ఉంది. అయితే, వివిధ ఒత్తిళ్లతో ఫోరం ఆయన ప్రసంగాన్ని రద్దు చేసింది. ఎటువంటి రాజకీయ భావనలకు మేం మద్దతు ఇవ్వమని, ఎటువంటి సిద్ధాంతాలను తాము ఆమోదించమని, భారత్ అభివృద్ధిపై చర్చ జరపడమే తమ ధ్యేయమని, ప్రస్తుతానికి అయితే, మోడీ ప్రసంగాన్ని రద్దు చేశామని వార్టన్ ఓ ప్రకటనలో తెలిపింది.
మోడిపై మండిపాటు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబంపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఖండించారు. ప్రధాని కావాలనే అధికార దాహంతో మోడి అవాకులు, చవాకులు మాట్లాడారని పొంగులేటి సుధాకర్ రెడ్డి, రుద్రరాజు పద్మరాజులు విమర్శించారు.












Click it and Unblock the Notifications