వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ కుటుంబమంతా నీచులే: శోభా హైమావతి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Hymavathi
హైదరాబాద్: మీ కుటుంబమంతా నీచులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విజయమ్మ నీచుడు అనడంపై ఆమె మండిపడ్డారు. మొత్తం తమ కుటుంబమే నీచులమయమని వైయస్ విజయమ్మమరిచిపోయినట్టున్నారన్నారు.ఎదుటివారి గురించి మాట్లాడటం మానుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే తమ చరిత్రంతా ఏమిటో కనిపిస్తుందన్నారు.

గుమాస్తా పని ఇచ్చి అన్నం పెట్టిన గని యజమానినే చంపిన మీ మామ పెద్ద నీచుడని, ప్రజలు నమ్మి అధికారం ఇవ్వగా, కొడుక్కి రాష్ట్రాన్ని దోచి పెట్టిన మీ భర్త, ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన మీ కొడుకు జగన్, మత ప్రచారం చేస్తున్నట్లు పైకి కనిపిస్తూ లక్షల ఎకరాల్లో గనులను సొంత ఆస్తిలా రాయించుకోవాలని చూసిన నీ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, మేయర్‌గా ఉండి రైతులకు చెందాల్సిన ఎరువులను నల్ల బజారులో అమ్ముకొన్న నీ తమ్ముడు.. ఇలా మీ వాళ్లే నీచులని, మీ కుటుంబానిదే పెద్ద నీచ చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విచారణకు వర్ల డిమాండ్

వీరభద్రా రెడ్డి లేఖలో అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాలని టిడిపి నేత వర్ల రామయ్య డిమాండ్ వేరుగా విజయవాడలో డిమాండ్ చేశారు. చేశారు. కొండల రావు తన పేరిట 40 ఎకరాల భూమి రాసినట్లు వీరభద్ర ఆ లేఖలో పేర్కొన్నారని, ఈ కొండల రావు ఎవరు, ఆ భూమి అతనికి ఎలా వచ్చిందనేది తేల్చాలని, వైయస్ ముఖ్యమంత్రి కాకముందు కొండల రావు స్థితి ఏమిటో విచారించాలన్నారు.

చిన్న రేకుల షెడ్డులో ఉండే బ్రదర్ అనిల్ కుమార్ ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్‌కు అల్లుడయ్యారన్నారు. కొండల రావు కూడా అనిల్‌కు పరిచయం అయ్యేనాటికి తెల్లరేషన్ కార్డుదారేనన్నారు. వీరభద్రా రెడ్డి పేరుమీద రూ.20లక్షల షేర్లు, ఆయన తండ్రి పేరిట రూ.32 లక్షల షేర్లు ఉన్నాయన్నారు. ఇదంతా వీరభద్రా రెడ్డికే తెలియదన్నారు. కొండల రావు తన బినామీ కాదని అనిల్ గుండెమీద చేయి వేసుకుని చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మామ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడబెట్టుకోవడం నిజంకాదా? అని నిలదీశారు.

English summary
Telugu Mahila president Sobha Hymavathi lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X