వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై దాడి ఎదురుదాడి, రాజీనామాలు: అనంతలోనూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Dadi Veerabadar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు రాజుకుంది. పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు ఆదివారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను పదవులు అడగలేదని, పార్టీలో బిసిలకు ప్రాధాన్యత కొరవడుతోందని ఆయన ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీలో ఆత్మగౌరవమే లేకుండా ఎలా అని ప్రశ్నించారు.

మండలిలో పార్టీ ప్రతిష్ట నిలబడేలా తాను చేశానన్నారు. యనమల రామకృష్ణుడు అభ్యర్థిత్వానికి తాను వ్యతిరేకం కాదని కానీ, ఆయన మొదట లోకసభ లేదా రాజ్యసభకు వెళ్తానని చెప్పారన్నారు. పని చేసే వాళ్లను గుర్తించనప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎన్ని మైళ్ల పాదయాత్ర చేసినా ప్రయోజనం లేదన్నారు. తాను పదవి కోసం ఆరాటపడటం లేదని కానీ, అప్పటికప్పుడు చెప్పడం తనను బాధించిందన్నారు.

చివరి నిమిషంలో తాను పనికి రానని అభిప్రాయపడటం బాధించిందన్నారు. తనకు కనీస మర్యాద ఇవ్వనందుకే తాను బాధపడుతున్నానని చెప్పారు. తాము ధనికులం కాకపోవచ్చునని కానీ గౌరవం మాత్రం కావాలని హితవు పలికారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా పార్టీలో పని చేస్తానన్నారు. దాడి పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారట. చంద్రబాబు పైన ఎదురుదాడికి దిగడంతో ఆయన పొలిట్ బ్యూరోకు రాజీనామా చేయవచ్చునని అంటున్నారు.

కాగా, తెలుగుదేశంలో శాసన మండలి చిచ్చు మరింత రాజుకున్న విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణిని శాసనమండలి అభ్యర్థులుగా ఎంపిక చేసి, సీనియర్‌ను అయిన తనను ఎంపిక చేయక పోవడంతో దాడి వీరభద్ర రావు అసంతృప్తికి గురయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవి మరో రెండు నెలలు ఉంది. అయినప్పటికీ తనను పరిగణలోకి తీసుకోక పోవడంతో రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారట.

ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నారట. మరోవైపు దాడి వీరభద్ర రావుకు మరోసారి అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం టిడిపి నేతలు రాజీనామాలు చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులు తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.

అంతకుముందు దాడిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరిలు రంగంలోకి దిగారు. వరుస రాజీనామాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యకు వారు సిద్దమయ్యారు. దాడిని వారు బుజ్జగిస్తున్నారు. అయితే, తాను పదవి కోసమే అలకబూనలేదని, తనకు మొదటనే విషయాన్ని చెబితే బావుండేదని, సమావేశంలో అప్పటికప్పుడు చెప్పడం తనలాంటి సీనియర్‌కు బాధ అనిపించిందని ఆయన చెబుతున్నారట.

యనమల రామకృష్ణుడి ఖరారు అప్పటికప్పుడే జరిగిందని, ముందుగా అనుకొని చేసింది కాదని, అందుకే అలా చేశారని సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని ఇది అప్పటికప్పుడు జరిగిందే తప్ప అవమానపర్చే ఉద్దేశ్యమేదీ లేదని చెప్పారట. మరోవైపు శమంతకమణిని అభ్యర్థి ప్రకటించడం అనంతపురం జిల్లాలో అసంతృప్తిని రాజేసింది. శమంతకమణి పేరును వెనక్కి తీసుకోకుంటే తాము రాజీనామాలు చేస్తామని జిల్లాలోని పలువురు నేతలు హెచ్చరించారు.

English summary
It is said that Telugudesam Party Anakapalli constituency Mandal president sent resignation letters to TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X