ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయపడను: బాబు, కూల్చేద్దాం రండి: కెసిఆర్ లేఖలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-K Chandrasekhar Rao
ఏలూరు/హైదరాబాద్: 2014 తర్వాత కాంగ్రెసు ఆధ్వర్యంలోని యూపిఏ అధికారంలోకి మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చెబుతున్నారని, ఆ వ్యాఖ్యల ఆర్థమేమిటో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రశ్నించారు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

2014 తర్వాత కాంగ్రెసుకు జగన్ పార్టీ చెప్పిందన్నారు. భవిష్యత్తులో చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేసినట్లు జగన్ కూడా చేస్తారన్నారు. అవిశ్వాసం అంటూ చేసే సవాళ్లు కేసుల మాఫీ కోసమేనని విమర్శించారు. ఆ పార్టీ నేత దోపిడీని ప్రశ్నిస్తే ప్రతిపక్షం విఫలమైనట్లా అని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన దోపిడీ, అవినీతి, అరాచక పాలన అని ధ్వజమెత్తారు.

కార్యకర్తలు పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. తనపై కేసులకు తానెప్పుడు భయపడలేదన్నారు. తప్పు చేయలేదు కాబట్టి తాను భయపడనన్నారు. టిడిపి శాసనసభా పక్ష వ్యూహ కమిటీ టిడిఎల్పీ కార్యాలయంలో సమావేశమైంది. రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చంద్రబాబు నాయుడుతో టెలికాన్ఫరెన్సు‌లో చర్చించారు. బడ్జెట్ సమావేశాలు, అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కాంగ్రెసుతో కుమ్మక్కు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కైందని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. స్పీకర్ ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ కాంగ్రెసు అభ్యర్థికి ఓటేసిందన్నారు. ఇటీవల ఎఫ్‌డిఐ ఓటింగు సమయంలో జగన్ వర్గం నేత సబ్బం హరి కాంగ్రెసుకు మద్దతు పలికారన్నారు.

ప్రభుత్వాన్ని పడగొడతాం: జగన్, బాబులకు కెసిఆర్ లేఖలు!

ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా హైదారాబాదులో అన్నారు. ఇందిరాపార్కు వద్ద వ్యాట్‌ను నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో కెసిఆర్ పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టి తీరుతామన్నారు. ఎపి మినహా దేశంలోని ఏ రాష్ట్రంలో వ్యాట్ లేదని, వ్యాట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, దానికి మద్దతివ్వాలని కోరుతూ టిడిపి, జగన్ పార్టీలకు కెసిఆర్ లేఖలు రాయనున్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said on Tuesday that he is not afraid of cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X