జగన్ కేసు: 3గురు మంత్రులతో ఈ నెల్లో తుది ఛార్జీషీట్!

సిబిఐ దాఖలు చేసే ఈ తుది ఛార్జీషీటులో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ముప్పై మందిని నిందితులుగా పేర్కొనే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు అన్ని క్విడ్ ప్రోకో ప్రకారమే జరిగాయని సిబిఐ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి ఆధారాలు సేకరించిన సిబిఐ తుది ఛార్జీషీటును మూడో వారంలో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసును సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జగన్‌ను గతేడాది మే 27న సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుండి అతను జైలులో ఉంటున్నారు.
బెయిల్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు. జగన్ తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు జగన్‌కు, సిబిఐకి సూచనలు చేసింది. 2013 మార్చి 31లోగా విచారణ పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించిన సుప్రీం కోర్టు అప్పటి వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని జగన్‌కు సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications