Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పుడు వార్తలకు ఎడిటరే బాధ్యుడు: సుప్రీం కోర్టు

Supreme Court
న్యూఢల్లీ: పత్రికల్లో తప్పుడు వార్తలు వస్తే అందుకు సంపాదకుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పత్రికల్లో వచ్చిన తప్పుడు వార్తాకథనంపై సివిల్ లేదా క్రిమినల్ కేసు నమోదైతే సంపాదకుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని సోమవారం తెలిపింది.

పత్రికల్లో ప్రచురించే విషయాలను సంపాదకుడు ఎంపిక చేస్తాడు కాబట్టి తన అనుమతి లేకుండా వార్తను ప్రచురించారని చెప్పినంత మాత్రాన ప్రొసిడింగ్స్ నుంచి మినహాయించలేమని సికె ప్రసాద్, విజి గౌడలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.

ప్రెస్ అండ్ రిజిస్ట్రేష్ట్రేషన్ పుస్తకాల చట్టం ప్రకారం విషయాలను ఎంపిక చేసే ప్రక్రియ సంపాదకుడి చేతిలో ఉంటుందని, వార్తాపత్రిక ప్రతి ప్రతి మీద కూడా యజమాని పేరుతో పాటు సంపాదకుడి పేరు ఉంటుందని, అందువల్ల సివిల్, క్రిమినల్ ప్రోసిడింగ్స్‌లో సంపాదకుడిని కూడా బాధ్యుడ్ని చేయాల్సి ఉంటుందని చెప్పింది.

1999లో పరువు నష్టం కలిగించే వార్త కథనాన్ని ప్రచురించాలనే నిర్ణయాన్ని తాను తీసుకోలేదని, రెసిడెంట్ ఎడిటర్ తీసుకున్నాడని, అందువల్ల ఆ వార్తా కథనం ప్రచురణకు తాను బాధ్యుడిని కాదని అంటూ తనపై ప్రోసిడీంగ్స్‌ను కొట్టేయాలని గుజరాతీ దినపత్రి సందేష్ సంపాదకుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+