వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మతో మాట్లాడిందెవరో తెలియదు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తమ పార్టీలో విలీనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎవరితో మాట్లాడారో తనకు తెలియదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనంపై తాను తటస్థమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు విలీనాన్ని తాను స్వాగతించబోను, వ్యతిరేకించబోనని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానంతో సంబంధం లేకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన శానససభ్యులపై చర్యలు తీసుకుంటామని, వివరాలను ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి గానీ ప్రజా సమస్యలపై కాదని ఆయన అన్నారు. బలాబలాలు సభలోనే తేలుతాయని ఆయన అన్నారు. అధికారం కోసమే విపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన అన్నారు. అవిశ్వాసంపై ఇతర పార్టీల వైఖరులతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ అంశం సున్నితమైందని, పరిష్కారం కోసం కాంగ్రెసు పార్టీ కృషి చేస్తోందని బొత్స అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గందరగోళం ఉందని, ఓ వైపు యుపిఎకు మద్దతిస్తామంటూనే మరోవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తానని అంటోందని ఆయన అన్నారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టిందని ఆయన అన్నారు. ఉగాది నుంచి చౌకధరల దుకాణాల ద్వారా 9 నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని ఆయన ఆయన వారిద్దరినీ పిలిచారు. ఈ నెల 18 - 21 తేదీల మధ్య రాహుల్ గాంధీ కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.

English summary
PCC president Botsa Satyanarayana said that he didn't know with whom YSR Congress party honorary president YS Vijayamma has held talks on merger. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X