కాంగ్రెసుకు తోకగా మారారు: బాబుపై హరీష్ రావు

బుధవారం ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం తెరాస శాసనసభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతు ఇవ్వబోమని చేసిన ప్రకటన ద్వారా నిజస్వరూపం బయపడిందని ఆయన అన్నారు. చంద్రబాబు దిగుజారుడుతనానికి ఈ నిర్ణయం నిదర్శనమని ఆయన అన్నారు.
తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే తెలుగుదేశం పార్టీయే పెట్టాలని, తాము బేషరతుగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టిడిపి మద్దతుగా నిలుస్తోందని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వానికి సంఖ్యాబలం లేకున్నా టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, నిజానికి ఇప్పుడు ప్రభుత్వం కొనపూపిరితో ఉందని, అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు తీరును తప్పు పట్టేవారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ శానససభ్యులు శానససభకు బయలుదేరారు. లాంతర్లు, ఖాళీ బిందెలతో వారు ప్రదర్శన నిర్వహించారు. బిజెపి శానససభ్యుడు జి. కిషన్ రెడ్డి సైకిల్‌పై శాసనసభకు వచ్చారు.












Click it and Unblock the Notifications