హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా, గవర్నర్ జోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజు బుధవారం వేడి, వాడి కనిపించింది. శాసనసభ, శాసనమండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. తెలంగాణ నినాదాలతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి విసిరేశారు. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు.

తెరాస సభ్యుల ఆందోళన మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని గుక్క తిప్పుకోకుండా ఆదరాబాదరాగా చదివేశారు. తాను చేయాల్సిన ప్రసంగాన్ని చేసేసి ముగించారు. తెరాస సభ్యుల ఆందోళనను అసలు పట్టించుకోలేదు. బుధవారం ప్రారంభమైన సమావేశాలు ఈనెల 26 వరకు జరుగనున్నాయి. బుధవారం ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

20 నుంచి 26 వరకు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. 18న ఆర్థిక బడ్జెట్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టనున్నారు. 26న బడ్జెట్‌పై ఓన్ ఆన్ అకౌంట్ జరుగనుంది. ఏప్రిల్ 23 నుంచి రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి.

విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాదం, కరువుపై చర్చ జరపాలని తెలుగుదేశం, వామపక్షాలు సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 30 రోజులు జరపాలని తెలుగుదేసం, తెలంగాణ చర్చించాలని తెరాస, బిజెపి, సిపిఐ నేతలు కోరినట్లు సమాచారం.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వస్తున్న గవర్నర్ నరసింహన్‌ను తోడ్కొన్ని వస్తున్న శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణి.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

గవర్నర్‌కు స్వాగతం చెబుతున్న శాసనమండలి చైర్మన్ చక్రపాణి..

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో సరదాగా గవర్నర్. చక్రపాణి కూడా చిత్రంలో ఉన్నారు.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, గవర్నర్‌కు మధ్య నవ్వులు జల్లు...

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

గవర్నర్‌, ముఖ్యమంత్రి పరస్పరం అభివాదం చేసుకుంటున్న దృశ్యం.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు గవర్నర్, పక్కన స్పీకర్.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్..

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఇలా..

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

పరస్పరం ముచ్చట్లలో మంత్రులు, ధర్మాన ప్రసాదరావు కూడా చిత్రంలో ఉన్నారు.

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

మహిళా మంత్రులు, మహిళా సభ్యులు ఇలా...

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

మరికొంత మంది మంత్రులు ఇలా...

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి గల్లా అరుణ, తదితరులు..

పిక్చర్స్: తొలి రోజు అసెంబ్లీ వేడిగా..

ఎర్ర చొక్కాల్లో వామపక్షాల సభ్యులు, గులాబీ కండువాలతో తెరాస సభ్యులు.

తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించకపోతే సభను అడ్డుకుంటామని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. తెరాస సభ్యులను బయటకు పంపించి, ప్రజా సమస్యలపై చర్చించాలని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. మొత్తం మీద తొలి రోజు అసెంబ్లీ సమావేశం ఆసక్తికరంగానే సాగింది.

English summary
The issue of demand for a separate Telangana state was raised in the Andhra Pradesh assembly during the Budget Session on Wednesday, March 13. In fact, opposition Telangana Rashtra Samithi (TRS) expressed their protest while governor ESL Narasimhan's was to address the joint session of both houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X