జగన్ రిమాండ్ పొడగింపు: శ్రీలక్ష్మిపై నిర్ణయం వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసులో తదుపరి చార్జిషీట్‌పై అభియోగాల నమోదుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాదనలకు సిద్ధం కావాలని కోర్టు జగన్ తరఫు న్యాయవాదులకు సూచించింది. అయితే, అభియోగాల నమోదు ప్రారంభిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని జగన్ తరఫు న్యాయవాదులు చెప్పారు.
ఎమ్మార్ కుంభకోణం కేసు నిందితులను కూడా కోర్టు విచారించింది. వివిధ కేసుల్లో నిందితులు బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు కోర్టుకు తెలిపారు.
తన మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై సిబిఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అనారోగ్యానికి గురైన శ్రీలక్ష్మికి చికిత్స నిమిత్తం కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications