కిరణ్‌పై జగన్ వ్యూహం: ఎమ్మెల్యేలు రాజీనామా వెనక్కి

ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌లు ఇటీవల కాంగ్రెసు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలు స్పీకర్ వద్దే ఉంటే వాటిని ఆయన ఆమోదించే అవకాశముంది.
అవిశ్వాసం ఎదుర్కొనేందుకు వాటిని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇది కాంగ్రెసు పార్టీకి లాభిస్తుంది. అధికార పార్టీకి లాభించకుండా ఉండేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహంలో భాగంగా వారిద్దరు రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామాలు చేసిన వారు.. తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.
ఈ సమావేశాల్లో అధికార పార్టీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే పరిస్థితి వస్తే వీరిద్దరు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మరో రెండు ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా, కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా జగన్ పార్టీ వ్యవహరించి వారిద్దరి రాజీనామాలు వెనక్కి తీసుకునేలా చేసిందంటున్నారు.
రాజీనామాలు వెనక్కి తీసుకోలేదు
తాము రాజీనామాలు వెనక్కి తీసుకున్నారన్న ప్రచారంపై ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌లు స్పందించారు. తాము స్పీకర్‌ను కలువలేదని, రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఇదంతా తమపై చేస్తున్న దుష్ప్రచారం అని వారు అన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications