వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15మంది వస్తారు: రాజేష్, ఎమ్మెల్యేలకి జగన్ పార్టీ వల!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maddala Rajesh
హైదరాబాద్: తాను అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తానని చిత్తూరు జిల్లా చింతలపూడి కాంగ్రెసు పార్టీ రెబల్ శాసనసభ్యుడు మద్దాల రాజేష్ శుక్రవారం అన్నారు. మద్దాల రాజేష్ ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ సాగుతోంది. అవిశ్వాసంపై మద్దాల రాజేష్ స్పందించారు.

తాను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పారు. అధికార పార్టీ ధిక్కార హెచ్చరికలకు బెదిరేది లేదన్నారు. తనతో పాటు మరో పదిహేను మంది శాసనసభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. ఉప ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాంగ్రెసు ఎమ్మెల్యేకు జగన్ పార్టీ వల

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వల వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబును అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని జగన్ పార్టీ నేత శోభానాగి రెడ్డి కోరితే ఆయన తిరస్కరించినట్లుగా సమాచారం.

కిరణ్‌పై హైకోర్టుకు

కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఉప్పు వెంకట నారయణ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కిరణ్‌ను ఎన్నుకున్నారని, ఆయనను సిఎల్పీ ఎన్నుకోలేదని పిటిషన్‌లో అతను పేర్కొన్నారు.

సభలో గూండా మల్లేష్

అవిశ్వాస తీర్మానంపై సభలో గూండా మల్లేష్ మాట్లాడుతూ... కిరణ్ ప్రభుత్వం ఆక్సిజన్ మీద బతుకుతోందని, ప్రతిపక్షాల అనైక్యత ప్రభుత్వానికి లాభిస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచింది తాము కాదని కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. రాజీవ్ యువ కిరణాలతో వచ్చే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదన్నారు.

సభలో యెండల

కాంగ్రెసు పార్టీ తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని బిజెపిఎల్పీ యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు నిలువునా మోసం చేసిందన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా నాన్చుతోందన్నారు.

English summary
Chinthalapudi MLA Maddala Rajesh said that he is 
 
 ready to face by polls. He said he will support No 
 
 Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X