నేడు ఆనం రాష్ట్ర బడ్జెట్: వ్యవసాయానికి తొలిసారి

ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది మూడోసారి. ఎప్పటిలాగానే ఈసారి పెట్టేదీ పూర్తిస్థాయి బడ్జెట్టే అయినా.. ప్రస్తుతం తొలి మూడు నెలల (ఏప్రిల్-జూన్) పద్దులకే ఆమోదముద్ర వేయనున్నారు. మిగిలిన తొమ్మిది నెలల పూర్తిస్థాయి బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీల సమగ్ర చర్చ తర్వాత ఏప్రిల్-మే నెలల్లో జరిగే సమావేశాల్లో ఆమోదిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ప్రవేశపెట్టనున్నారు.
కొన్నేళ్లుగా సమగ్ర చర్చ అనేదే లేకుండా పద్దులన్నీ గిలెటిన్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈసారి స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతో కొంతమేరకైనా చర్చలు జరిగి.. నిధుల వినియోగానికి ఎంతోకొంత సార్థకత లభిస్తుందని సర్కారు యోచిస్తోంది. దేశంలోనే ఎక్కడాలే ని విధంగా రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినందున, ఈ దఫా వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
2013-14 బడ్జెట్ సుమారు రూ 1.60లక్షల కోట్లుగా ఉండవచ్చు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.56వేల కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ.1.04 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం అడిగినన్ని నిధులు మంజూరు చేసేందుకు వీలుగా సీఎం ప్రత్యేక నిధికి రూ.వెయ్యి కోట్లకుపైగా కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications