జగన్ ఆస్తుల కేసు: జగతి పబ్లికేషన్స్‌కు ఈడి నోటీసులు

Vijaya Sai Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) దూకుడు పెంచింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ వ్యవహారంలో ఏప్రిల్ 2వ తేదిన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడి.. జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డికి, జగతి పబ్లికేషన్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈడి నోటీసుల నేపథ్యంలో తనకు ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించాలని విజయ సాయి రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఛార్జీషీట్ నుండి తొలగించాలని సాయి పిటిషన్

జగన్ అక్రమాస్తుల కేసులో రెండో ఛార్జీషీటు నుంచి తనను తొలగించాలని విజయ సాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విజయ సాయి రెడ్డి పిటిషన్ పైన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 1వ తేదికి వాయిదా వేసింది.

జగన్ రిమాండ్ పొడిగింపు

జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులలో నిందితుల రిమాండును సిబిఐ కోర్టు బుధవారం పొడిగించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండును ఏప్రిల్ ఒకటో తేది వరకు కోర్టు పొడిగించింది. ఎమ్మార్, వాన్‌పిక్, ఛార్జీషీట్లలో అభియోగాల నమోదుపై సిబిఐ వాదనలు పూర్తయ్యాయి.

సిబిఐ కోర్టుకు మంత్రి ధర్మాన హాజరు

జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు బుధవారం ఉదయం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయ సాయి రెడ్డి, బిపి ఆచార్య కూడా సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+