హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ 'సాక్షి'కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Sakshi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సమయంలో స్పీకర్‌ని ఉద్దేశించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

వాటిని యథాతథంగా ప్రచురించి సాక్షి దిన పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు శాసనసభ కార్యదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు. తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం సాక్షి పత్రిక ఎడిటర్‌కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. సభా గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకే ఆ పత్రికకు హక్కుల నోటీసు ఇచ్చినట్లు సదారాం తెలిపారు.

సిబిఐ దుర్వినియోగం

తమను వ్యతిరేకించే వారి పైన కాంగ్రెసు పార్టీ సిబిఐని ఉసిగొల్పుతోందని సిపిఎం ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా డిఎంకె నేత స్టాలిన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిబిఐను కేంద్రం దుర్వినియోగపరుస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు. తమను వ్యతిరేకిస్తే కేసులు, జైళ్లు అనే ధోరణిలో కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సిబిఐపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.

ఉద్యమకారులపైనే చట్టాలా?

తెలంగాణపై మాట ఇచ్చి తప్పిన కాంగ్రెసు పార్టీ పైన కేసులు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. సడక్ బందులో ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల పైనే చట్టాలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. అంతకుముందు తెరాస సభ్యులు సిఎం చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వానికి సంబంధం లేదు

సడక్ బందులో తెలంగాణ ఉద్యమకారుల అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కేసులు పెట్టారన్నారు. ఈ అంశంపై రేపు అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు.

English summary
It is said that Congress is actively considering moving a privilege motion against YSR Congress Party leader Mysoora Reddy and Sakshi daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X