వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్‌దత్ కోసం జయప్రద యత్నాలు: సేన యు టర్న్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt - Jayaprada
ముంబయి/కోల్‌కతా: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు క్షమాభిక్ష పెట్టాలని, వద్దనే వాదనలు ఊపందుకుంటున్నాయి. బిజెపి, శివ సేన వంటి పార్టీలు సంజయ్ దత్‌కి క్షమాభిక్ష వద్దని డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు తదితర పార్టీలు క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నాయి. సమాజ్‌వాది పార్టీ నుండి బయటకు వచ్చిన నేత అమర్ సింగ్, రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద క్షమాభిక్ష పెట్టాలని చెబుతున్నారు.

ఇందుకోసం జయప్రద, అమర్ సింగ్‌లు మహారాష్ట్ర గవర్నర్ కె శంకర నారాయణ అపాయింటుమెంటును కోరారు. జయప్రద, అమర్‌లు సంజయ్ దత్‌కు క్షమాభిక్ష పెట్టాలని గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసి కోరనున్నారు. మంగళవారం గవర్నర్ అపాయింటుమెంటును కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా సంజయ్‌కి క్షమాభిక్ష పెట్టాలని వంత పాడుతున్నారు.

శివసేన రివర్స్ స్టాండ్

మహారాష్ట్రలో ప్రధాన పార్టీగా ఉన్న శివ సేన సంజయ్ దత్ క్షమాభిక్ష విషయంలో యూ టర్న్ తీసుకుంది. ఇరవయ్యేళ్ల క్రితం సంజయ్ దత్‌కి శిక్ష పడినప్పుడు ఆయనకు బెయిల్ వచ్చేందుకు శివసేన అధినేత బాల్ థాకరే నాడు సహకరించారు. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ సంజయ్‌కు క్షమాభిక్ష పెట్టవద్దని చెబుతోంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంజయ్ దత్‌కి ఐదేళ్ల శిక్ష విధించినందున అతనికి క్షమాభిక్ష పెడితే సమాజంలోకి తప్పుడు సమాచారం వెళుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, మజ్లిస్ పైన మహారాష్ట్రలో నిషేధం విధించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర శాసన మండలిలో శివసేన సభ్యుడు దివాకర్ రౌటే లేవనెత్తారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఔరంగాబాద్ రాకుండా నిషేధాజ్ఞలు విధించారని, ఆయన పార్టీని మహారాష్ట్రలో నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటీవలి సంఘటనలు పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.

English summary
Expelled SP leader Amar Singh and Rampur MP Jayaprada have sought an appointment with Maharashtra Governor Shankaranarayan on Tuesday, apparently to seek paradon for Bollywood actor Sanjay Dutt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X