ఎమ్మెల్యేలకు జగన్ పార్టీ నేత మంత్రాలయం ప్రసాదం

2009 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన బాలనాగి రెడ్డి ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డిలు ఒకేసారి టిడిపి నుండి జగన్ వైపుకు వెళ్లారు.
కాగా, అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన తర్వాత జగన్ పార్టీ ఎమ్మెల్యేలు రెండో గేటు ముందు మంగళవారం రాత్రి ధర్నాకు దిగారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం సభలో సమాధానం చెప్పకుండా అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసుకొని పారిపోయిందని ఆరోపిస్తూ వారు ఈ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపును తప్పుపడుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.
కాసేపటి తర్వాత జగన్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌చేసి అక్కడినుంచి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ముందు కూడా వారు ఆందోళనకు దిగినా పోలీసుల అభ్యర్థనతో విరమించుకున్నారు. విద్యుత్ సమస్యపై 'ప్రజా బ్యాలెట్' కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ నిర్ణయించింది. విద్యుత్ కోతలు, వాతలపై ప్రజా బ్యాలెట్ ద్వారా జనాభిప్రాయం సేకరించి ప్రభుత్వం తీరును ఎండగడతామని పార్టీ ముఖ్యులు మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications