పిల్ల కొంచెం: షర్మిలపై గండ్ర, కిరణ్ బౌలర్లను ఆటాడేశారు

చిత్తశుద్ధి లేని ఆందోళనలను ప్రజలు ఎవరూ నమ్మర్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. చలోక్తులు విసురుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పడు సభకు ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి తీరు పిల్ల కొంచె కూత ఘనంగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం మానేసి విఫలం అయ్యారంటూ లెక్చర్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారని అన్నారు. అందుకే ఇతర మంత్రులు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే అవకాశాలు తక్కువగా వచ్చాయని అన్నారు.
సోనియా ఆదేశాలతో...
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్‌లు రూపొందించాయన్నారు. దళారుల నుండి ప్రజలను రక్షించేందుకు నగదు బదలీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications