జూ.ఎన్టీఆర్‌తో 'జగన్' మైండ్ గేమ్! దేనికి సంకేతం?

YS Jagan - Jr Ntr
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఓ ఫ్లెక్సీలో వెలువడం ఇప్పుడ కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటు తెలుగుదేశం, అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జగన్ సోదరి షర్మిల పాదయాత్ర నేపథ్యంలో చిటికిన యూత్ పేరుతో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం నేత ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

దేనికి సంకేతం?

జగన్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలో జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ విజయమ్మ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెట్టారు. జగన్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ఉండటంతో ఇది దేనికి సంకేతం అనే చర్చ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణపై జూనియర్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

దీనికి బాలయ్య తెరదించే ప్రయత్నాలు ఇటీవల విశాఖలో చేశారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జగన్‌తో పాటు ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో గందరగోళానికి తెర పడలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టిడిపిపై అసంతృప్తితో ఉన్న ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లోపాయికారిగా మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ టిడిపిలో సాగుతోంది.

అనుకోకుండా పెట్టిందా?

ఫ్లెక్సీ అనుకోకుండానే పెట్టి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ పార్టీలోకి వెళ్లిన కొడాలి నాని జూనియర్‌కు సన్నిహితుడు. అతను టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం వెనుక జూనియర్ హస్తం ఉందనే ప్రచారం జరిగినా వాటిని ఎన్టీఆర్ కొట్టిపారేశారు. అయితే ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయనేందుకు ఇప్పటి ఫ్లెక్సీయే నిదర్శనం. కొడాలి నాని వర్గానికి చెందిన నాయకుడు అత్యుత్సాహంతోనే జగన్, నాని, ఎన్టీఆర్‌లతో కలిసిన ఫోటో పెట్టి ఉంటారని అంటున్నారు.

'జగన్' మైండ్ గేమ్

వైయస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్‌లో ఇది కూడా ఓ భాగం కావొచ్చని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మామయ్య చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ పైన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిని అనుకూలంగా మార్చుకునేలా జగన్ పార్టీ మైండ్ గేమ్ కూడా కావొచ్చంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, స్వర్గీయ నందమూరి తారక రామారావుల పేర్లు ప్రస్తావించేవారు.

ఎక్కడైనా ఫోటోలు కూడా బాలయ్య, ఎన్టీఆర్‌లవి కలిపి ఉండేవి. ఇటీవల కేవలం తాత, మనవళ్ల ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. జూనియర్ అసంతృప్తికి ఇది నిదర్శనం. అసంతృప్తి ఉన్నప్పటికీ ఆయన టిడిపికి మద్దతు ప్రకటించకుండా ఉండని పరిస్థితి ఎంతగా అసంతృప్తి ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాల్సిందే అంటున్నారు. ఆయన అసంతృప్తిని మాత్రం జగన్ పార్టీ తమ లబ్ధికి వాడుకునే ప్రయత్నాలు ఇందులో కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఎమ్మెల్యేల చేరిక, అవిశ్వాసం తదితర వాటిల్లో జగన్ మైండ్ గేమ్ అడుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకొని మైండ్ గేమ్ అడుతున్నారేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ బాబుతో లేరని జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆ పార్టీ భావిస్తుండవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+